మోదీకి పాక్ 'పావురం' లేఖ

2 Oct, 2016 20:03 IST|Sakshi
మోదీకి పాక్ 'పావురం' లేఖ

పఠాన్‌కోట్: పంజాబ్- పాకిస్థాన్ సరిహద్దు వద్ద పావురం లేఖలు కలకలం రేపుతున్నాయి. పఠాన్ కోట్ సమీపంలోని బమియాల్ సెక్టార్ లోగల సింబాల్ పోస్ట్ వద్ద.. పాక్ వైపు నుంచి వచ్చిన బూడిద రంగు పావురాన్ని ఆదివారం బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. ఆ పావురం కాళ్లకు కట్టి పంపిన ఉర్దూ లేఖలో నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ.. 'మోదీజీ మీ(ఇండియా)తో యుద్ధం చేయడానికి ఇక్కడి యువకులందరూ సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని నాటి(1971 యుద్ధంనాటి) వాళ్లకింద లెక్కకట్టకండి..' అని రాసి ఉన్నట్లు పంజాబ్ పోలీసులు చెప్పారు. పావురాన్ని కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు. (సరిహద్దుల్లో పాక్‌ గాలిబుడగల దుమారం!)

కాగా, శనివారం కూడా ఇదే తరహాలోగురుదాస్‌పూర్‌లోని ఘేసల్ గ్రామం గాలిబుడగలకు కట్టిన లేఖలు పాక్ నుంచి ఇండియాకు వచ్చి వాలాయి. గురుదాస్‌పూర్‌లోని ఘేసల్ గ్రామంలో రెండు బెలూన్ లేఖలను గుర్తించిన పోలీసులు.. ఆ లేఖలో 'మోదీజీ, సహనం అనే కత్తులు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి' అని ఉర్దూలో రాసిఉన్నట్లు చెప్పారు.సెప్టెంబర్ 23న కూడా పంజాబ్‌లో హోషియార్‌పూర్ జిల్లాలో ఉర్దూలో రాసి ఉన్న ఉత్తరంతో ఉన్న ఓ తెల్ల పావురాన్ని భారత అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు