కలెక్షన్లతో దుమ్మురేపుతోంది!

21 Sep, 2016 20:31 IST|Sakshi
కలెక్షన్లతో దుమ్మురేపుతోంది!

బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో నటించిన పింక్ సినిమా కలెక్షన్లు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. తొలిరోజు అతి తక్కువ కలెక్షన్లతో ప్రారంభమైన ఈ సినిమాకు మౌత్‌టాక్‌ బలంగా పనిచేయడంతో భారీగా వసూళ్లు రాబడుతోంది. తొలి వారాంతంలో రూ. 21.51 కోట్లు సాధించిన ఈ సినిమా.. ఐదురోజులు ముగిసేసరికి  రూ. 28.8 కోట్లు సాధించింది.

శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ. 4.32 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు శనివారం 7.65 కోట్లు, మూడో రోజు ఆదివారం 9.54 కోట్లు, సోమవారం రూ. 3.78 కోట్లు, మంగళవారం రూ. 3.51 కోట్లు రాబట్టింది.  దేశంలో తొలి మూడు రోజుల్లో సుమారు 29 కోట్లు రాబట్టిన ’పింక్‌’.. విదేశాల్లోనూ మంచి వసూళ్లు రాబడుతున్నదని, అమెరికా, కెనడా, యూఏఈలో ఈ చిత్రం 6.55 కోట్లు వసూలు చేసిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

ఈమధ్య కాలంలో ఏ సినిమాకూ రానివిధంగా రివ్యూయర్లు పింక్కు ఐదుకు ఐదు స్టార్లు ఇచ్చారు. ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసల జల్లు కురిపించడంతో క్రమంగా థియేటర్లు, మల్టీప్లెక్సులలో ప్రేక్షకుల సందడి పెరుగుతోంది.

>
మరిన్ని వార్తలు