భారతీయులూ.. అప్రమత్తంగా ఉండండి!

16 Jul, 2016 11:27 IST|Sakshi
భారతీయులూ.. అప్రమత్తంగా ఉండండి!

న్యూఢిల్లీ: సైనిక తిరుగుబాటుతో టర్కీలో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడి భారతీయులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. టర్కీలో నివసిస్తున్న భారతీయులెవరు వీధుల్లోకి రావొద్దని, స్థానికంగా ఉన్న భారత రాయబార కార్యాలయంతో వారు నిత్యంలో టచ్ లో ఉండాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సూచించారు.

టర్కీలో పరిస్థితులు కుదుటపడేవరకు ఆ దేశానికి భారతీయులు వెళ్లకూడదని, అక్కడికి ఏమైనా ప్రయాణాలు తలపెడితే మానుకోవాలని తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో బహిరంగ ప్రజాప్రదేశాలకు వెళ్లకుండా ఇంట్లో ఉండటమే మంచిదని భారతీయులకు సుష్మ సలహా ఇచ్చారు. ఏమైనా సమస్యలు ఎదురైతే ఈ హెల్ప్‌లైన్లు: అంకారా: +905303142203, ఇస్తాంబుల్ +905305671095 ద్వారా భారత రాయబార కార్యాలయ అధికారులను సంపద్రించాలని సుష్మ సూచించారు. టర్కీలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా అంచనా వేస్తున్నామని, అక్కడ ఉన్న భారతీయుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని భారత విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ తెలిపారు.

మరిన్ని వార్తలు