'ఆన్లైన్'లో ఇంత మోసమా!

12 Oct, 2016 18:22 IST|Sakshi
'ఆన్లైన్'లో ఇంత మోసమా!

జమ్మికుంట: పండుగ సంబురానికి అదనంగా డెలివరీ బాయ్ తెచ్చిన ల్యాప్టాప్ పార్సిల్ను చూసి ఆ కుటుంబం ఎగిరి గంతేసింది. ఉత్సుకతతో పార్సిల్ తెరిచిచూసి ఒక్కసారిగా దిగ్భాంతికి గురైంది! ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా బుక్ చేసిన లాప్‌టాప్కు బదులు ఫ్లైవుడ్(చెక్క) ముక్క కనిపించిందా పార్సిల్లో! కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

స్థానికంగా నివాసం ఉంటోన్న మామిడాల శ్రీధర్.. నవంబర్ 2న స్నాప్డీల్ అప్లికేషన్ ద్వారా రూ.34 వేల విలువచేసే హెచ్పీ ల్యాప్టాప్ను బుక్ చేసుకున్నారు. మంగళవారం(దసరా పండుగనాడు) ఆ బుకింగ్కు సంబంధించిన పార్సిల్ను డెలివరీ బాయ్ తీసుకొచ్చాడు. పార్సిల్ తీసుకుని ఇంట్లోకి వెళ్లిన శ్రీధర్ తీరా దాన్ని తెరిచి చూశాక.. ల్యాప్టాప్కు బదులు ఫ్లైవుడ్ ఉండటంతో కంగుతిన్నాడు. పార్సిల్ తెరిచే టప్పుడు వీడియో తీసిన బాధితుడు తాను మోసపోయిన తీరును మీడియాకు వెల్లడించాడు. (ఆ దృశ్యాలను వీడియోలో చూడొచ్చు)

మోసం తెలుసుకున్న తర్వాత డెలివరీ బాయ్కి ఫోన్ చేయగా.. 'నాకేమీ తెలియదని, ఏం చేసుకుంటావో చేసుకోమని' అన్నట్లు శ్రీధర్ చెప్పారు. ఈ వ్యవహారంపై స్నాప్డీల్ కంపెనీకి కూడా ఫిర్యాదుచేశామని, వారి నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్కు మెయిల్ చేసిన అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదుచేశానని పేర్కొన్నారు. కాగా, గతంలోనూ ఇలాంటి మోసాలు చోటుచేసుకున్నప్పుడు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, అమెజాన్ లాంటి పెద్ద ఆన్లైన్ వ్యాపార సంస్థలు.. ఆయా డెలివరీ బాయ్స్తోపాటు స్థానిక డిస్ట్రిబ్యూటర్లపైనా చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి.


>
మరిన్ని వార్తలు