నోట్ల రద్దుపై మోదీ ఎమోషనల్ స్పీచ్..

13 Nov, 2016 14:41 IST|Sakshi
నోట్ల రద్దుపై మోదీ ఎమోషనల్ స్పీచ్..
పణజి: నల్లధనం, నకిలీ కరెన్సీలను రూపుమాపేక్రమంలో రూ.500, రూ1000 నోట్ల రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశమంతటా కలకలం చెలరేగింది. డిసెంబర్ 31లోగా పాత కరెన్సీని డిపాజిట్ చేయాలని, విత్ డ్రాయల్స్ మాత్రం విడతలవారీగా తీసుకోవాలని సర్కారు పేర్కొంది. ఈ నిర్ణయం నల్లబాబుల మీద ఏ మేరకు ప్రభావం చూపిందోగానీ, కోట్లాది మంది సమాన్యులు మాత్రం నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల ముందు క్యూలు కట్టారు. అయితే నోట్ల రద్దు విషయం ముందే లీకైందని, బీజేపీ, దాని మిత్రపక్షపార్టీల నాయకులతోపాటు కొందరు బడా బాబులు ఇప్పటికే నల్ల డబ్బును తగిన రూపాల్లోకి మార్చేసుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 
 
ఇటు ఆదివారం కూడా బ్యాంకులు పనిచేస్తున్నా జనం వెతలు ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం పణజి(గోవా)లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన భావోద్వేగ ప్రసంగం నోట్ల రద్దుపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడమేకాక, మరో 40 రోజుల పాటు నోట్ల ఇబ్బందులు తప్పవనే సంకేతాలిచ్చింది. జపాన్ పర్యటన నుంచి తిరిగొచ్చిన మోదీ నేరుగా గోవా వెళ్లి మోపా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగం పూర్తి వీడియో మీకోసం...