విజన్ ఉన్న రాజకీయ నాయకుడు మోదీ: ఒబామా

4 Dec, 2015 03:12 IST|Sakshi
విజన్ ఉన్న రాజకీయ నాయకుడు మోదీ: ఒబామా

వాషింగ్టన్: ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు  ఒబామా ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ నిజాయితీ కలిగిన వ్యక్తి అని, భారత అభివృద్ధికి సంబంధించి స్పష్టమైన విజన్ ఉన్న రాజకీయ నాయకుడని కితాబిచ్చారు. దేశాన్ని ఏ స్థాయికి, ఎలా తీసుకెళ్లాలనే విషయంపైనా మోదీకి ఒక విజన్ ఉందని, ఇది ఆయనను సమర్థ రాజకీయ నాయకుడినే కాకుండా.. సమర్థ ప్రధానమంత్రిగా నిలుపుతోందని కొనియాడారు. ఇరు దేశాల మధ్యా సంబంధాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు