జియోకు అనుమతి ఇవ్వలేదు

2 Dec, 2016 13:55 IST|Sakshi
జియోకు అనుమతి ఇవ్వలేదు

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం వివరణ  ఇచ్చింది. ముద్రణ మరియు ఎలక్ట్రానిక్ ప్రకటనల్లో నరేంద్ర మోదీ చిత్రాలు ఉపయోగించడానికి రిలయన్స్ జియోకు అనుమతి మంజూరు చేయలేదని   స్పష్టం చేసింది.  రాజ్యసభలో సమాజ్ వాది పార్టీ ఎంపీ నీరజ్ శేఖర్  గురువారం  అడిగిన ఒక  ప్రశ్నకు  రాతపూర్వక  సమాధానంగా సమాచార మరియు ప్రసార  శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు. ఎలక్ట్రానిక్ యాడ్స్ పై ప్రధాన మంత్రికార్యాలయం నుంచి  (పీఎంఒ) నుంచి ఎలాంటి అనుమతి  ఇవ్వలేదని  ఆయన తేల్చి చెప్పారు.

మంత్రిత్వ శాఖకు చెందిన  మీడియా యూనిట్, అడ్వర్టయిజింగ్  అండ్  విజువల్ పబ్లిసిటీ డైరెక్టరేట్ (డీఏవీపీ),  వివిధ మీడియా సంస్థలు,  ప్రభుత్వ సంస్థలకు  ప్రకటనలకు అనుమతి ఇస్తుందని తెలిపారు. కానీ  తమ నోడల్ ఏజెన్సీ డీఏవీపీ  ఏ ప్రైవేటు సంస్థ కు  మోదీ ఫోటోలను విడుదల చేయలేదని  చెప్పారు.  అయితే  అనుమతిలేకుండానే ప్రధాని ఫోటోలను వాడుకోవడంపై  జియోపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని  శేఖర్  కోరారు. చిహ్నాలు మరియు పేర్లు (అసమాన వినియోగం నివారణ) చట్టం 1950  ప్రకారం కన్జ్యుమర్ అఫైర్స్ , ఫూడ్ అండ్  పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రిత్వ శాఖ సమాధానమిస్తుందని చెప్పారు.

కాగా బిలియనీర్ రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ జియో ఇన్ ఫ్రాటెల్  వ్యాపార ప్రకటనల్లో మోదీ పోటోలు దర్శనమివ్వడంపై పలు విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు