పెద్దనోట్ల రద్దు: రంగంలోకి పీఎంవో!

14 Nov, 2016 12:48 IST|Sakshi
పెద్దనోట్ల రద్దు: రంగంలోకి పీఎంవో!
న్యూఢిల్లీ: డబ్బును పొందడానికి బ్యాంకుల ముందు, పోస్టాఫీసుల ముందు ప్రజలు గంటలుగంటలు తీవ్రకష్టాలు పడుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా డబ్బు ఉపసంహరణ ఎలా సాగుతున్నదో తెలుపుతూ నివేదిక ఇవ్వాలని అధికారులను కోరింది. ‘ప్రధానమంత్రి దేశంలోకి వచ్చారు. ఆయన త్వరలోనే బ్యాంకుల అధిపతులు, ఇతర భాగస్వాములతో దేశంలోని పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. (కరెన్సీ మార్పిడి అంశంపై) ప్రధాని ఇప్పటికే నివేదిక కోరారు’ అని పీఎంవో వర్గాలు మీడియాకు తెలిపాయి. నోట్లరద్దుపై ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రధాని మోదీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ, ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ పాల్గొననున్నారు.

పెద్దనోట్ల కరెన్సీ రద్దు నిర్ణయం ప్రకటించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడురోజుల జపాన్‌ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. జపాన్‌ పర్యటన ముగించుకొని భారత్‌ వచ్చిన ఆయన పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు పడుతున్న పాట్లపై స్పందించిన సంగతి తెలిసిందే. తనకు 50 రోజుల సమయం ఇస్తే ప్రజల కష్టాలను దూరం చేస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మరోవైపు ఆర్బీఐ కూడా తమ తగినంత కరెన్సీ ఉందని, ఈ విషయంలో భయాలు వద్దని భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. 
మరిన్ని వార్తలు