పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ, పరిస్థితి ఉద్రిక్తం

28 Jun, 2015 09:04 IST|Sakshi

చెన్నై:  వేలూరు జిల్లా ఆంబూరులో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ కలకలం రేపింది. తమ వాడిని లాకప్ డేత్ చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులపై ఆగ్రహంతో పోలీస్ స్టేషన్పై ఆందోళనకారులు దాడిచేసి విధ్వంసం సృష్టించారు. ఈ దాడిలో ఎస్పీతోపాటు 15మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

అంతేకాక 4 బస్సులను కూడా ఆందోళనకారులు దగ్ధం చేసినట్టు తెలిసింది. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్తంగా మారింది. దాంతో పోలీసులు 2 వేల మంది వరకు పహారా కాసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు