అర్థరాత్రి కాల్పులు.. ఏడుగురు యువకులు మృతి

10 May, 2015 13:32 IST|Sakshi

బెర్లిన్: స్విట్జర్లాండ్లో కాల్పులు చోటుచేసుకుని ఏడుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి తర్వాత చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వారెన్లింగెన్ అనే చిన్న పట్టణంలో పలు నివాస సముదాయాల వద్ద ఒక్కసారిగా తుపాకీ పేలుళ్ల చప్పుడ్లు వినిపించాయని, వెళ్లి చూసేవరకు ఇంటి బయటా లోపల పలువురు రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు. చనిపోయినవారంతా యువకులేనని పోలీసులు తెలిపారు. అసలు కాల్పులు ఎందుకు చోటుచేసుకున్నాయి? అందుకు గల కారణాలేమిటనే విషయం ఇంకా తెలియాల్సి ఉందని, ప్రస్తుతం విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు