పోలీసులకు శిక్ష తప్పదు..

13 Apr, 2015 12:44 IST|Sakshi

హైదరాబాద్: శేషాచల ఎన్కౌంటర్ వివాదం మరింత రాజుకుంటోంది. ఎన్  కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై హత్యకేసు నమోదు చేయాలనే డిమాండ్ మరింత ఊపందుకుంది. హైకోర్టు సూచనమేరకు  పౌరహక్కుల నేతలు,  ఎన్కౌంటర్ మృతుల బంధువులు  చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో  సోమవారం ఫిర్యాదు చేశారు.

తమ వాళ్ళను అతికిరాతకంగా చంపిన వాళ్లను శిక్షించాలని మృతుల రక్తసంబంధీకులు  కోరుతున్నారు. బాధితుల తరపున బంధువులు, గ్రామస్తులు, పౌరహక్కుల సంఘం నాయకులు స్టేషన్ కు చేరుకుని పోలీసులపై హత్యానేరం ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. దీంతో పాటు మృతదేహాలకు రీపోస్ట్మార్టం  నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆదరాబాదరాగా జరిగిన మొదటి పోస్ట్మార్టంలో అన్ని గాయాలను నోట్ చేయలేదని  వారు ఆరోపిస్తున్నారు.   కాగా 20 మంది కూలీలను హత్య చేసిన పోలీసులకు శిక్ష తప్పదని  హక్కుల సంఘాల నేతలంటున్నారు.

మరిన్ని వార్తలు