లోక్‌సభ ఎన్నికల ఖర్చు పరిమితి పెంపు

14 Feb, 2014 01:48 IST|Sakshi

కోల్‌కతా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు పరిమితి పెరిగింది. ఈ సారి రూ. 40 లక్షల వరకూ అనుమతినిచ్చారు. గత ఎన్నికల్లో రూ. 25 లక్షల పరిమితిని 2011 ఉప ఎన్నికల నుంచి పెంచారని, ఇపుడు ఆ ప్రకారమే ఖర్చు చేయవచ్చని పశ్చిమబెంగాల్ జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సైబల్ బర్మన్ గురువారం చెప్పారు.
 
  అయితే పార్టీలు అసంతృప్తిగా ఉన్నాయని, పరిమితిని మరింత పెంచాలంటూ పలు పార్టీలు కోరుతున్నాయని తెలిపారు. అభ్యర్థుల ఖర్చుపై గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, ఖర్చు పర్యవేక్షకుల ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్థిర  నిఘా బృందాలు, వీడియో బృందాలు పనిచేస్తాయని వెల్లడించారు. ఆ ఖర్చు పక్కదారి పట్టకుండా పర్యవేక్షకులు చైతన్యం తీసుకొస్తారని, మీడియా ద్వారా కూడా ప్రచారం చేస్తామని బర్మన్ చెప్పారు.

మరిన్ని వార్తలు