-

కేసీఆర్ చైనా వెళ్లడం వల్లే వర్షాలు

11 Sep, 2015 13:51 IST|Sakshi
కేసీఆర్ చైనా వెళ్లడం వల్లే వర్షాలు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. శుక్రవారం హైదరాబాద్లో పొన్నం ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడుతూ... నిజామాబాద్ జిల్లా రైతు లింబయ్య ఆత్మహత్యపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీకి బహిరంగ సవాల్ విసిరారు. లింబయ్య ఆత్మహత్యకు వ్యవసాయ సంక్షోభమే కారణమని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 491 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని టీఆర్ఎస్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై పొన్నం మండిపడ్డారు. మెదక్ జిల్లాలో 55 మంది రైతు కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ఆయన ఆ పార్టీ నాయకులను నిలదీశారు. సదరు ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు ఎందుకు పరిహారం ఇవ్వలేదని అడిగారు. ఆత్మహత్యకు పాల్పడ్డ ఒక్కో రైతు కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందించాలన్నారు. కేసీఆర్ చైనాకు వెళ్లడం వల్లే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్నాళ్లు కేసీఆర్ విదేశాల్లో ఉంటే తెలంగాణలో వర్షాలు పడి పంటలు పండుతాయని ప్రజలంతా అనుకుంటున్నారని పోన్నాల ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు