భారీగా పతనమైన బ్రిటిష్ పౌండ్

4 Oct, 2016 15:20 IST|Sakshi
భారీగా పతనమైన బ్రిటిష్ పౌండ్

లండన్ : బ్రిటిష్ కరెన్సీ  పౌండ్  విలువ దారుణంగా పడిపోయింది.  డాలర్ తో పోలిస్తే  పౌండ్ విలువ 31ఏళ్ల కనిష్టానికి పతనమైంది.  బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్‌ వాసులు ఓటు వేసిన ఉదంతం తరువాత  భారీగా క్షీణించింది.   అనంతరం ఇది  మరో భారీ పతనం. జూన్  1985 నాటికి విలువకు  పడిపోయింది. ఈ పతనం మరింత కొనసాగనుందని ఎనలిస్టులు భావిస్తున్నారు

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్  నిష్క్రమణ ఆందోళనలతో  పెట్టుబడిదారులు కరెన్సీ విక్రయాలకు  దిగారు. దీంతో  పౌండ్ విలువ1శాతం నష్టంతో మూడు దశాబ్దాల కిందికి దిగజారింది. బ్రిటన్ ప్రధానమంత్రి  థెరిస్సా  మే  బ్రెగ్జిట్  మార్చి చివరి నుంచి  మొదలవుతుందని ఆదివారం ప్రకటించారు. దీంతో సోమవారం  స్టెర్లింగ్ పౌండ్ 1 శాతానికిపైగా నష్టపోయింది. ఈ అమ్మకాలు మంగళవారం కొనసాగాయి. అధికారిక 'ఆర్టికల్ 50' చట్టపరమైన నిష్క్రమణ ప్రక్రియ తర్వాత  బ్రిటన్, ఈయూ  ప్రాధమిక రెండు సంవత్సరాల  నెగోషియేటింగ్ పీరియడ్ లోకి ప్రవేశించనున్నాయి.   
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పౌండ్‌ అతిపెద్ద పతనాలు 1971లో నిక్సన్‌ ప్రభుత్వం అంతర్జాతీయంగా డాలర్‌ను బంగారంతో మార్చడాన్ని రద్దు చేసినప్పుడు దాదాపు పౌండ్‌ 3.4శాతం విలువ కోల్పోయింది. దీనిని అప్పట్లో 'నిక్సన్‌ షాక్‌'గా అభివర్ణించారు.  1978 నవంబర్‌ 1న యూకే ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం దెబ్బతినడంతో ఒక్క రోజులో 4.3శాతం విలువ కోల్పోయింది. దీనిని 'వింటర్‌ ఆఫ్‌ డిస్‌కాంటెంట్‌'గా  పేర్కొన్నారు.  యూకే 1992 సెప్టెంబర్‌ 16న ఈయూ ఎక్స్‌చేంజి రేట్‌ వ్యవస్థ నుంచి వైదొలగింది. ఈ నేపథ్యంల పౌండ్‌ 4.29శాతం విలువ కోల్పోయింది. 2009 జూన్‌ 20న ఆర్థిక సంక్షోభం కారణంగా పౌండ్‌ 3.9శాతం విలువ కోల్పోయిన సంగతి తెలిసిందే.

కాగా డాలర్ తోపోలిస్తే  దేశీ కరెన్సీ రూపాయి 0.02పైసల నష్టంతో ఉంది. గత మూడు రోజులుగా లాభాలతో ఉన్న రూపాయి  నష్టాల్లోకి జారుకుంది.  ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే రూపాయి 4 పైసలు పెరిగింది. 66.54 వద్ద మొదలై  66.90 దగ్గ ఉంది.
 

మరిన్ని వార్తలు