త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం:మహారాష్ట్ర సీఎం

16 Jan, 2014 16:49 IST|Sakshi
త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం:మహారాష్ట్ర సీఎం

నాగ్పూర్:ఎక్కడైనా విద్యుత్ ఛార్జీలను పెంచడం మాత్రమే తరచు చూస్తూ ఉంటాం. కానీ మహారాష్ట్రలో అందుకు భిన్నంగా విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయి. త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ రాష్ట్ర  సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చౌహాన్.. విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. విద్యుత్ ఛార్జీలపై పారిశ్రామిక శాఖా మంత్రి నారాయణ్ రానే అధ్యక్షతన నవంబర్ 19వ తేదీన ఏర్పాటు చేసిన కమిటీ తాజాగా ఓ నివేదిక రూపొందించిందన్నారు.  దీనిపై జనవరి 20వ తేదీన ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉందని చౌహాన్ తెలిపారు.

 

కాగా టోల్ ఛార్జీలపై ఈ వారంలో సమీక్ష నిర్వహించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ అంశంపై తీవ్రంగా కసరత్తులు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఆ శాఖకు చెందిన మంత్రి నుంచి సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించామన్నారు.

 

 

మరిన్ని వార్తలు