ట్రంప్ దగ్గరున్న ఖరీదైన కార్లేమిటో తెలుసా?

24 Jan, 2017 07:09 IST|Sakshi
డొనాల్డ్ జే. ట్రంప్...ప్రపంచానికి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్పై అనూహ్య విజయం సాధించి, అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. 45వ అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన ట్రంప్, బిజినెస్మ్యాన్గా, రియల్ ఎస్టేట్ మొగల్గా, రియాల్టీ టెలివిజన్ పర్సనాలిటీగా ఎంతో పాపులర్ కూడా. ఆయనకు కార్లంటే అమితాసక్తట. కార్లంటే ఇంత పిచ్చి ఉన్న డొనాల్డ్ ట్రంప్ దగ్గర చాలా ఖరీదైన కార్లే ఉన్నాయట. ట్రంప్ దగ్గరున్న కొన్ని కార్ల వివరాలు...
 
లాంబోర్ఘిని డయాబ్లో : 
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారుగా ఎక్కువగా ప్రాముఖ్యం చెందిన ఈ ఇటాలియన్ కారుకు ట్రంప్ 90లోనే యజమాని అట. 1997లో ట్రంప్ ఈ కారును కొనుగోలు చేశారు. 90లో ఈ కారు మోస్ట్ ఐకానిక్ కారుగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ కారు గంటకు 320 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 325 కిలోమీటర్లు. సూపర్ స్పోర్ట్స్ కారు సెగ్మెంట్ డియాబ్లోకే అంకితం. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్లు 3000 యూనిట్లు అమ్ముడుపోయాయి. 
 
రోల్స్-రాయిస్ ఫాంటమ్:
మీ దగ్గర అమితమైన సంపద ఉందనుకో మీరేం చేస్తారు? చాలామందైతే రోల్స్ రాయిస్ కొనుక్కోని ఎంచక్కా రోడ్లపై పరుగులు పెట్టిస్తుంటారు. సంపన్న వ్యక్తంటే రోల్స్ రాయిస్... రోల్స్ రాయిస్ అంటే సంపన్న వ్యక్తి. మరి వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలి, అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ దగ్గర, ఈ కారు ఉండకుండా ఉంటుందా? ట్రంప్ దగ్గర కూడా రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉందట. 6.7 లీటర్, వీ-12 ఇంజన్ను కలిగిన ఈ కారు 453 బీహెచ్పీ పవర్ను ఉత్పత్తిచేస్తుందట. ఈ కారు ధర 500,000 డాలర్లు అంటే రూ.3,41,00,050.
 
రోల్స్ రాయిస్ సిల్వర్ క్లౌడ్ :
1956లోనే రోల్స్ రాయిస్ రోల్స్ రాయిస్ సిల్వర్ క్లౌడ్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొనుగోలు చేశారట. కొన్ని ఈవెంట్లకు ఆయన ఈ కారులోనే వెళ్లేవారట. 1955 నుండి 1966 మధ్య కాలంలో ఈ బాక్స్ రూపంలో ఉన్న సిల్వర్ క్లౌడ్ కార్లను రోల్స్ రాయిస్ ఉత్పత్తి చేసింది.  రోల్స్ రాయిస్ దీనిని మూడు జనరేషన్లలో విడుదల చేసింది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 165 కిలోమీటర్లు. 1950 కార్లతో పోలిస్తే దీన్ని స్పీడేమి తక్కువ కాదంటలేండి.
 
2003 మెర్సిడెస్-బెంజ్ ఎస్ఎల్ఆర్ మెక్లారెన్:
2003లో ఇది విడుదల చేసినప్పటినుంచి మెర్సిడెస్కు ఇది సూపర్ మార్కెట్గా ఉంది. ఇది చాలా ఖరీదైన కారట. దీని ధర 455,000 డాలర్లట. దేశీయ కరెన్సీ లెక్కల ప్రకారం రూ.3 కోట్లకు పైమాటే. మెర్సిడెస్, బెంజ్ కలిసి దీన్ని రూపొందించాయి. 2005లో ఇది ట్రంప్ టవర్లోకి ప్రవేశించిందట. ట్రంప్ ఈ కారును ఎక్కువగా ఇష్టపడతాడని టాక్. ఇవే కాక ఇంకా చాలా బ్రాండెడ్ కార్లే ట్రంప్ దగ్గరున్నాయట. 
 
 
 
 
మరిన్ని వార్తలు