జోర్డాన్లో మహాత్ముడి పేరిట వీధి

11 Oct, 2015 15:28 IST|Sakshi

అమ్మన్: ప్రపంచానికి అహింస, సత్యాగ్రహమనే గొప్ప అస్త్రాలను అందించిన మహాత్మాగాంధీ సేవలను స్మరిస్తూ జోర్డాన్ రాజధాని అమ్మన్లో ఓ వీధికి ఆయన పేరును పెట్టారు. జోర్డాన్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లాంఛనంగా ఈ వీధిని ఆవిష్కరించారు. ఈజిప్షియన్ ఉద్యమ నాయకుడు సద్జగ్లౌల్ స్ట్రీట్లోని కొంత భాగానికి గాంధీ స్ట్రీట్గా నామకరణం చేశారు.

భారత్లో శాంతి కోసం జరిగిన పోరాటానికి, ఈ వీధికి చారిత్రక సంబంధముందని, అందుకే ఈ స్ట్రీట్కు గాంధీ పేరును పెట్టామని అమ్మన్ మేయర్ అఖెల్ బెల్ తాగి తెలిపారు. సామ్రాజ్యవాద పాలనకు వ్యతిరేకంగా భారత్లో గాంధీ ఉద్యమించే సమయంలోనే, ఇక్కడ సద్జాగ్లౌల్ కూడా పోరాడారని, భారత్ కన్నా ఒక సంవత్సరం ముందే 1946లో జోర్డాన్ కు స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన గుర్తుచేశారు.

 

మరిన్ని వార్తలు