-

కొత్త సీఎంకు ప్రధాని ఆశీస్సులు

18 Mar, 2017 15:05 IST|Sakshi
కొత్త సీఎంకు ప్రధాని ఆశీస్సులు

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి తొమ్మిదో ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ కృష్ణకాంత్ పాల్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన హరక్ సింగ్ రావత్ సహా మొత్తం తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి పదవి రేసులో ఉంటారని భావించిన సత్పాల్ మహరాజ్ కూడా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, ఉమాభారతి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పొరుగు రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లాగే, ఉత్తరాఖండ్‌లో కూడా బీజేపీ బ్రహ్మాండమైన మెజారిటీ సాధించింది. మొత్తం 70 స్థానాలున్న అసెంబ్లీలో 57 స్థానాలు బీజేపీకే దక్కాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి తొలుత సత్పాల్ మహరాజ్ లాంటి పెద్ద పేర్లు వినిపించినా, చివరకు త్రివేంద్ర సింగ్ రావత్‌ను ఖరారు చేశారు.

2014లో ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. రావత్‌కు ఆర్ఎస్ఎస్ మద్దతు ఉండటమే కాక, అమిత్ షా ఆశీస్సులు సైతం మెండుగా ఉన్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమిత్ షా యూపీ ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి పనిచేశారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ స్థాయి నుంచి మొదలుపెట్టి.. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఈయన ఎదిగారు. గతంలో మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉండటంతో ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఈయనను వరించిందని అంటున్నారు.

మరిన్ని వార్తలు