నో బెస్ట్‌ ఫ్రెండ్స్‌.. ప్రైవేటు స్కూల్‌కు ప్రిన్స్‌!

25 Mar, 2017 13:32 IST|Sakshi
నో బెస్ట్‌ ఫ్రెండ్స్‌.. ప్రైవేటు స్కూల్‌కు ప్రిన్స్‌!

బ్రిటన్‌ బుజ్జీ రాకుమారుడు జార్జ్‌ త్వరలో ప్రైవేటు పాఠశాలలో చేరబోతున్నాడు. ఈ పాఠశాల ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ తమ విద్యార్థులు ఉత్తమ మిత్రులను కలిగి ఉండటాన్ని నిరుత్సాహపరుస్తారు. 'దయతో ఉండాలన్నది' ఈ స్కూల్‌ మొదటి నిబంధన కాగా.. బెస్ట్‌ ఫ్రెండ్స్‌ లేకపోవడమే మంచిది అనేది ఇక్కడి సిద్ధాంతం.

బ్రిటన్‌ రాజవంశం నివాసముండే కేన్‌సింగ్టన్‌ ప్యాలెస్‌కు కొద్దిమైళ్ల దూరంలో ఉన్న థామస్‌ బ్యాటర్‌సీ పాఠశాలలో ప్రిన్స్‌ జార్జ్‌ చేరబోతున్నాడు. వచ్చే సెప్టెంబర్‌ నుంచి అతను బడికి వెళ్లబోతున్నాడని ఇప్పటికే కేన్‌సింగ్టన్‌ ప్యాలెస్‌ ట్విట్టర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ స్కూల్‌లో నాలుగు నుంచి 13 ఏళ్ల మధ్య వయసు కలిగిన 540 మంది బాలబాలికలు చదువుతున్నారు. పిల్లల సత్ప్రవర్తనపై ప్రధానంగా శ్రద్ధ పెట్టే ఈ స్కూల్‌లో విద్యార్థులు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ కలిగి ఉండటాన్ని మాత్రం నిరుత్సాహ పరుస్తారు. బెస్ట్‌ఫ్రెండ్స్‌గా ఉండి.. ఉన్నత చదువుల కోసం వారి నుంచి వెళ్లిపోయే సమయంలో చిన్నారుల హృదయాలలో వెలిభావన ఏర్పడి.. గాయపడుతాయనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు