గత ఆగస్టులోనే రూ. 2 వేల నోట్ల ముద్రణ

3 Mar, 2017 20:27 IST|Sakshi

ఇండోర్‌: నోట్ల రద్దు నిర్ణయానికి రెండున్నర నెలల ముందుగానే రూ.2 వేల నోట్ల ముద్రణ ప్రారంభమైందని ఆర్‌బీఐకు అనుబంధ సంస్థ అయిన భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నోట్‌ ముద్రణ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(బీఆర్ బీఎన్ ఎంపీఎల్) వెల్లడించింది. సమాచార హక్కు చట్టం ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌడ్‌ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది.

రూ.2 వేల నోట్ల ముద్రణ 2016 ఆగస్టు 22న, రూ. 500 నోట్ల ముద్రణ నవంబర్‌ 23న ప్రారంభించామని తెలిపింది.  పాత 500 రూపాయల నోట్లను గతేడాది 27 నుంచి ప్రింట్ చేయడం మానేసినట్టు తెలిపింది. వెయ్యి రూపాయల నోట్ల ముద్రణను జూలై 28 నుంచే ఆపేసినట్టు వెల్లడించింది.

మరిన్ని వార్తలు