అప్పుడు, ఇప్పుడు అలాంటి కేసు...

8 Jul, 2015 16:07 IST|Sakshi
అప్పుడు, ఇప్పుడు అలాంటి కేసు...

న్యూఢిల్లీ: అది కోల్‌కతా నగరం.1935, ఏప్రిల్ 9వ తేదీ. రిపన్ కళాశాలలో పనిచేస్తున్న యువ ప్రొఫెసర్ అశ్విని గుప్తా అనారోగ్య కారణాలతో సెలవు పెట్టారు. తన వద్ద ప్రైవేటుగా ట్యూషన్ చెప్పించుకుంటున్న సమరేశ్ ముఖర్జీ అనే విద్యార్థి తరఫున పరీక్ష హాలుకెళ్లి బీఏ ఎకనామిక్స్  పరీక్ష రాశారు. తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆయన్ని అరెస్టు చేసి కేసు పెట్టారు.

అప్పట్లో స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎనిమిది నెలల లోపలే విచారణ పూర్తి చేశారు. అదే ఏడాది డిసెంబర్‌లో అశ్విని గుప్తాకు స్థానిక కోర్టు ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. గుప్తా అప్పీల్ చేసుకోవడంతో కేసు కలకత్తా హైకోర్టుకు వెళ్లింది. 1936, ఏప్రిల్ 22 వ తేదీన కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనంటూ హైకోర్టు తీర్పు చెప్పింది.

ఇప్పుడు అలాంటి కేసే వ్యాపం అడ్మిషన్ల కేసు. కాకపోతే పెద్ద ఎత్తున జరిగిన కుంభకోణం. 2013లోనే కేసు దాఖలు చేసినా ఇంతవరకు విచారణ పూర్తికాలేదు. సరికదా, విచారణే ముందుకు సాగడం లేదు. అప్పటికన్నా సాంకేతికంగా న్యాయ వ్యవస్థ అభివృద్ధి చెందినా కేసుల విచారణ నత్తనడకనే నడుస్తోంది. ఎప్పుడు న్యాయ వ్యవస్థ ప్రక్షాళన గురించి న్యాయకోవిదులు మాట్లాడతారే తప్ప ఆ దిశగా చర్యలు తీసుకోరెందుకో!
 

మరిన్ని వార్తలు