ప్రాఫిట్‌బుకింగ్‌ తో బుక్కయిన మార్కెట్లు

2 Mar, 2017 16:44 IST|Sakshi

ముంబై:  దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.  ఆరంభంలో  వరుసగా రెండో రోజుకూడా లాభాల్లో,రికార్డ్‌ స్థాయిల్లో  మురిపించిన మార్కెట్లు  చివరికి నీరసించాయి.  అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ 145 పాయింట్లు క్షీణించి 28,840 వద్ద , నిఫ్టీ  46 పాయింట్లు నష్టపోయి 8,900 వద్ద స్థిరపడింది. ముఖ‍్యంగా, యూరప్‌ మార్కెట్లు ప్రతికూలంగా మారంతో  ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు.  దీంతో మేజర్‌ సెక్టార్లు నష్టపోయాయి.

ముఖ్యంగా  రియల్టీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్‌ నిఫ్టీ,ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్లు  క్షీణించగా, ఫిబ్రవరి నెల  అమ్మకాల జోష్‌ తో ఆటో సె​క్టార్‌ లాభపడింది.  డీఎల్‌ఎఫ్‌  ఇండియాబుల్స్‌, శోభా, యూనిటెక్ షేర్లలో భారీ సెల్లింగ్‌ ప్రెజర్‌  కనిపించింది. ఇక మిగిలిన షేర్ల విషయానికి వస్తే..​బీపీసీఎల్‌,  ఐడియా, అదానీ పోర్ట్స్, సన్‌ ఫార్మా, ఎన్‌టీపీసీ, యస్‌బ్యాంక్‌, బీవోబీ, భారతీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఅండ్‌ఎం నష్టపోగా టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, అల్ట్రాటెక్‌, హీరోమోటో, టీసీఎస్‌, హిందాల్కో, సిప్లా, కోల్‌ ఇండియా. విప్రో  పుంజుకున్నాయి.
అటు ఫారెక్స్‌ మార్కెట్‌ లో  డాలర్‌  మారకంలో  ఇండియన్ కరెన్సీ  0.10పైసలు లాభపడి రూ. 66.72 వద్ద ఉంది. బులియన్‌మార్కెట్‌ లో వెండి ధరలు బాగా బలపడగా,  ఎంసీఎక్స్‌ మార్కెట్‌ లో బంగారం పది  గ్రా. 44 రూ క్షీణించి రూ. 29,373 వద్ద ఉంది.

 

మరిన్ని వార్తలు