గూగుల్ ఉద్యోగి చావుకు కారణమైన సెక్స్ వర్కర్ కు జైలు

20 May, 2015 17:23 IST|Sakshi
గూగుల్ ఉద్యోగి చావుకు కారణమైన సెక్స్ వర్కర్ కు జైలు

కాలిఫోర్నియా: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఉద్యోగి చావుకు కారణమైన వేశ్యకు అమెరికా కోర్టు ఆరేళ్లు జైలు శిక్ష విధించింది. ఉద్దేశపూర్వకంగా ఓ వ్యక్తి మరణానికి కారకురాలు అయినందుకు అలిక్స్ కేథరిన్ టిషెల్ మాన్(27) అనే సెక్స్ వర్కర్ ను శాంతాక్రజ్ సుపీరియర్ కోర్టు దోషిగా తేల్చి, శిక్ష విధించింది. గూగుల్ ఎగ్జిక్యూటివ్ ఫోరెస్ట్ హేయస్స్(51)కు హెరాయిన్ ఇంజక్షన్ ఇచ్చి అతడి చావుకు కారణమైంది. విలాసవంతమైన శాంతాక్రూజ్ ఓడలో 2013, నవంబర్ లో ఆమె ఈ దారుణానికి పాల్పడింది. 2014లో ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసు అధికారి ఒకరు కస్టమర్ లా నటించి వెయ్యి డాలర్లు అధికంగా ఇస్తామని చెప్పి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఫోరెస్ట్ హేయస్స్ కు హెరాయిన్ ఇంజక్షన్ ఇవ్వడమే కాకుండా చివరి క్షణాల్లో అతడికి ఎటువంటి సహాయం చేయలేదని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అత్యవసర వైద్య సేవల కోసం 911 నంబర్ కూడా ఫోన్ చేయలేదని పేర్కొంది. ఆమె చేసిన నేరం సీసీ కెమెరాలో రికార్డయిందని వెల్లడించింది. హత్యానేరంతో పాటు నిషేధిత మాదకద్రవ్యాలు కలిగివుండడం, సాక్ష్యాలు నాశనం చేయడం, వ్యభిచారానికి పాల్పడడం వంటి అభియోగాలు మోపింది. ఈ నేరాలన్నింటికీ కనీసం 15 ఏళ్ల జైలు పడుతుందని భావించారు. అయితే నేరం అంగీకరించి, క్షమాపణ చెప్పడంతో ఆమెకు ఆరేళ్ల శిక్ష పడింది.

మరిన్ని వార్తలు