పారిస్ లో తీవ్ర కలకలం, ఆందోళనలు

28 Mar, 2017 18:14 IST|Sakshi
పారిస్ లో తీవ్ర కలకలం, ఆందోళనలు

పారిస్: చైనా పౌరుడిని ఫ్రాన్స్ పోలీసులు కాల్చిచంపడంతో పారిస్ లో ఆందోళనలు మిన్నంటాయి. డిస్ట్రిక్ట్ పోలీసు హెడ్ క్వార్టర్స్ ఎదుట నిరసనకు దిగిన ఆందోళనకారులు హింసకు దిగారు. వాహనాలకు నిప్పు పెట్టారు. 56 ఏళ్ల చైనా పౌరుడిని అతడి ఇంటి ముందే ఆదివారం రాత్రి పోలీసులు కాల్చిచంపారు. పొరుగువారితో ఘర్షణ పడుతుండగా పోలీసులు కాల్పులు జరపడంతో అతడు మృతి చెందాడు. కత్తెర్లతో దాడి చేయడంతో అతడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.

ఈ ఆరోపణలను మృతుడి కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. పోలీసులు రావడానికి ముందు కత్తెర్లతో అతడు చేపలు కోశాడని వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు ప్రకటించారు. అటు చైనా విదేశాంగ శాఖ కూడా స్పందించింది. తమ దేశ పౌరుడిని కాల్చిచంపిన ఘటనపై దర్యాప్తు జరపాలని ఫ్రాన్స్ రాయబారిని కోరింది. తమ పౌరుల భద్రతకు తగిన చర్యలు చేపట్టాలని ఫ్రాన్స్‌ ప్రభుత్వాన్ని కోరింది.

మరిన్ని వార్తలు