సినిమారంగ షేర్లకు జీఎస్‌టీ షాక్‌

22 May, 2017 14:41 IST|Sakshi
సినిమారంగ షేర్లకు జీఎస్‌టీ షాక్‌

ముంబై: ఎన్‌డీఏ సర్కారు ప్రతిష్టాత్మక బిల్లు జీఎస్‌టీలో  వివిధ పన్నులు దాదాపు ఖరారయ్యాయి. దీంతో ఈ ప్రభావం  స్టాక్‌మార్కెట్లలో వివిధ రంగాలపై  బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా  ఎఫ్ఎంసీజీ లాంటి సెక్టార్లు దూకుడును ప్రదర్శిస్తుండగా, సినిమాలపై  అంచనాల కంటే అధికంగా పన్ను రేట్లు ఖరారు కావడంతో  సోమవారం స్టాక్‌మార్కెట్లలో  సినిమాకు సంబంధించిన  షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. పీవీఆర్‌, ఐనాక్స్‌ లీజర్‌ వంటి వినోద రంగ షేర్లు కుదేలయ్యాయి.

జీఎస్‌టీ  పరిధిల్లో పన్నుల శ్లాబులో  18 శాతం పన్ను ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేశారు. అయితే  జీఎస్‌టీ  కౌన్సిల్‌ 28 శాతం పన్ను రేటును ఖరారు చేసినట్టు శుక్రవారం  ఆర్థికమంత్రి అరుణ జైట్లీ ప్రకటించారు. దీంతో పీవీఆర్‌ షేర్‌ నెల రోజుల వ్యవధిలో 6 శాతం నష్టాన్ని నమోదు చేసింది. సోమవారం ఈ షేర్‌ ఇంట్రాడేలో రూ.1,400-రూ.1,513 కనిష్ట, గరిష్ట స్థాయిలను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో ఒక్కో షేర్‌ రూ.1,471 ధరకు రూ.6.83 కోట్ల బ్లాక్‌ డీల్‌ జరిగింది.

ఈ షేర్‌ ఏడాది కనిష్ట, గరిష్ట స్థాయిలు రూ.820, 1,660గా ఉన్నాయి. మరో మల్టీప్లెక్స్‌ కంపెనీ ఐనాక్స్‌ లీజర్‌ కూడా ఇదే బాటలో పయనిస్తూ నష్టాలను  మూటగట్టుకోవడం గమనార్హం. ప్రస్తుతం 15శాతంపన్ను అమలవుతున్న  సినిమారంగాన్ని  హెయ్యస్ట్‌ కేటగిరీలైన జూదం, బెట్టింగ్  లాంటి లో సినిమా రంగాన్ని చేర్చడంపై పరిశ్రమంగా  కొద్దిగా అసంతృప్తిగా వున్నారని ఏంజెల్‌ బ్రోకింగ్‌ అభిప్రాయపడింది. 

మరిన్ని వార్తలు