‘నీవు మరణించినా...నీ గాత్రం అమరం’

9 Mar, 2018 13:27 IST|Sakshi

అమృత్‌సర్‌ : ప్రముఖ సూఫీ సంగీత విద్వాంసుడు, వడాలి బ్రదర్స్‌లో చిన్నవాడైన ఉస్తాద్‌ పురాన్‌ చాంద్‌ వడాలి(75) శుక్రవారం ఉదయం అమృత్‌సర్‌లో కార్డియాక్‌ అరెస్ట్‌తో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న వడాలిని గురువారం అమృత్‌సర్‌లోని ఫోర్టిస్‌ ఎస్కార్ట్స్‌ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలిసింది. అంత్యక్రియలు వీరి పూర్వికుల గ్రామం వడాలిలో జరుగనున్నాయి.  

ఉస్తాద్‌ పురాన్‌ చాంద్‌ వడాలి, ప్యారేలాల్‌ వడాలిగా ప్రఖ్యాతి. వడాలి బ్రదర్స్‌ పంజాబీ సూఫీ సంగీతంలో విద్వాంసులు. 1975లో జలంధర్‌లో హర్‌భల్లా ఆలయంలో ఇచ్చిన తొలి ప్రదర్శనతో వడాలి బ్రదర్స్‌ ఎక్కువగా ఖ్యాతి పొందారు. వీరు భజనలు, గజల్స్‌, కాఫియాన్లు ఎక్కువగా పాడుతుంటారు. హిందీ మూవీ 'పిన్జార్' లో, ఇటీవల విడుదలైన 'తను వెడ్స్ మను' లో కూడా వడాలి బ్రదర్స్‌ పాటలు పాడారు.

ట్విట్టర్‌ నివాళి....
‘‘పంజాబ్‌ సాహిత్యాన్ని, సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఓ షెహన్షా నీ ఆత్మకు శాంతి చేకురాలని వేడుకుంటున్నాము’’ అంటూ ట్విట్టర్‌ ప్యారేలాల్‌ వడాలి మృతికి నివాళి అర్పించింది.

 

మరిన్ని వార్తలు