భీకర పోరాటంలో ఊహించని మలుపు

2 Nov, 2016 17:53 IST|Sakshi
భీకర పోరాటంలో ఊహించని మలుపు

అనాదిగా వస్తోన్న 'ఆహార గొలుసు' నియమం ప్రకారం కొండచిలువను చంపి తినాలనుకున్న గుంట నక్క.. అనూహ్యంగా ఉడుంపట్టుకు చిక్కి కుక్కచావు చచ్చింది. మనుగడకోసం జరిగిన ఈ భీకర పోరాటం తాలూకు ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. న్యూసౌత్ వేల్స్(బ్రిటన్)కు చెందిన తండ్రీకొడుకులు పనిమీద పట్నం పోయి ఊరికి తిరిగి వస్తూ మధ్యలో కాసేపు కారు ఆపారు. పక్కనుంచే గట్టిగా కసా-బుసా శబ్ధాలు వినిపించడంతో అటుగా కదిలారు.

తీరా చూస్తే.. కొండచిలువ-నక్కల పోరాటం. అప్పటికే నక్క తన కోరపళ్లతో కొండచిలువ తలను నమిలే ప్రయత్నం చేసింది. తనను తాను కాపాడుకునే క్రమంలో ఆ రెండు మీటర్ల భారీ కొండచిలువ.. నక్కను అమాంతం చుట్టేసి నలిపేసింది. దీంతో ఊపిరాడక నక్క చచ్చిపోయింది. ఈ దృశ్యాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించిన సాహస తండ్రీకొడుకులు.. ఇంకాస్త దగ్గరికి వెళ్లి నక్క నోట్లో నుంచి కొండచిలువ తలను బయటికి తీశారు. నక్కను చుట్టుముట్టిన కొండచిలువ కూడా వేరుచేసేందుకు ప్రయత్నించేశారట. కానీ విజయగర్వంతో ఊగిపోతోన్న ఆ కొండచిలువ వీళ్లకేసి బుసలు కొట్టడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వచ్చేశారట!





మరిన్ని వార్తలు