ఖంటాస్ ఎయిర్వేస్ కు ఫోరం మొట్టికాయ

1 Sep, 2014 15:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రయాణికుల లగేజీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఖంటాస్ ఎయిర్వేస్ కు వినియోగదారుల ఫోరం మొట్టికాయ వేసింది. ప్రయాణ సమయంలో లగేజీ పోవడానికి కారణమైనందుకు రూ. 75 వేలు జరిమానా విధించింది. గుర్గావ్ కు చెందిన నమ్రతా భార్గవ్, ఆమె భర్త అంకిత్ గలాటి- హనిమూన్ కు వెళుతూ ఖంటాస్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణించారు.

వీరి లగేజీ నాలుగు రోజుల తర్వాత అందింది. దీనిపై ఫిర్యాదు చేయగా ఖంటాస్ ఎయిర్వేస్ తక్కువ మొత్తం ఇవ్వజూపింది. దీంతో వారు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. రూ. 50 వేలు నష్టపరిహారంతో రూ.25 వేలు కోర్టు ఖర్చుల కింద ఇవ్వాలని ఖంటాస్ ఎయిర్వేస్ ను వినియోగదారుల ఫోరం ఆదేశించింది.

మరిన్ని వార్తలు