మోదీకి క్వీన్ ఎలిజబెత్ విందు

29 Oct, 2015 19:59 IST|Sakshi
మోదీకి క్వీన్ ఎలిజబెత్ విందు

లండన్: క్వీన్ ఎలిజబెత్ తో విందు, వెంబ్లే స్టేడియంలో ప్రసంగం, బ్రిటీష్ పాలకులతో భేటీలు... ఇదీ ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటన షెడ్యూల్. భారత ప్రధాని హోదాలో వచ్చే నెల తొలిసారి బ్రిటన్ పర్యటనకు మోదీ వెళుతున్నారు. నవంబర్ 12 నుంచి మూడు రోజుల పాటు బ్రిటన్ లో ఆయన పర్యటిస్తారు. మోదీతో కలిసి ప్రధాన కార్యక్రమాలన్నిట్లోనూ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ పాల్గొననున్నారు.

నరేంద్ర మోదీ గౌరవార్థం నవంబర్ 13న బకింగ్ హ్యామ్ ప్యాలెస్ లో క్వీన్ ఎలిజబెత్ విందు ఇవ్వనున్నారు. వెంబ్లే స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ఈ సభకు 60 వేల మందిపైగా ఎన్నారైలు హాజరువుతారని భావిస్తున్నారు. తర్వాత కామెరూన్ తో భేటీ అవుతారు.

సమయం ఉంటే వెస్ట్ మిడ్ లాండ్స్ లోని టాటా మోటార్స్ కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. నవంబర్ 14న ఉత్తర లండన్ లో అంబేద్కర్ మెమోరియల్ ను, 12వ శతాబ్దపు తత్వవేత్త బసవేశ్వర విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు.
 

మరిన్ని వార్తలు