రాణిగారి రేసుగుర్రం శరీరంలో నిషేధిత డ్రగ్స్

23 Jul, 2014 17:09 IST|Sakshi
రాణిగారి రేసుగుర్రం శరీరంలో నిషేధిత డ్రగ్స్

లండన్: ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ 2 పెంపుడు గుర్రం శరీరంలో నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్టు వైద్య పరీక్షలో వెల్లడైంది. దీని శరీరంలో నిషేధిత మార్ఫిన్ ఉన్నట్టు పరీక్ష ద్వారా నిర్థాణయిందని బకింగ్హామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. కలుషిత ఆహారం ద్వారా నిషేధిత పదార్థం దాని శరంలోకి ప్రవేశించివుండొచ్చని పేర్కొంది. ఈ విషయాన్ని బ్రిటీష్ హార్స్ రేసింగ్ అథారిటీకి రాణి ఎలిజబెత్ తెలిపారని గార్డియన్ పత్రిక వెల్లడించింది.

మారీ పేరుతో పిలుచుకునే ఈ గుర్రం వయసు ఐదేళ్లు. ఈ గుర్రం గేడాది ప్రతిష్టాత్మక గోల్డ్ కప్ గెల్చింది. మైఖేల్ స్టౌట్ దీనికి శిక్షణనిస్తున్నారు. రాణి ఎలిజబెత్ 2 దగ్గరవున్న ఐదు పెంపుడు గుర్రాల్లో ఇది ఒకటి. అయితే గుర్రం శరీరంలోని నిషేధిత పదార్థం ఎలా ప్రవేశించిందనే దానిపై దర్యాప్తు జరుపుతున్నామని రాజకుటుంబం తెలిపింది.

మరిన్ని వార్తలు