మళయాళ నటి కేసులో త్వరగా శిక్ష పడాలి: కేంద్రమంత్రి

20 Feb, 2017 15:41 IST|Sakshi
మళయాళ నటి కేసులో త్వరగా శిక్ష పడాలి: కేంద్రమంత్రి
మళయాళ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసును తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. ఇలాంటి కేసుల్లో నేరస్తులకు త్వరగా శిక్షలు పడాలన్నారు. ఈ కేసులో నేరస్థులకు కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని ఆయన అన్నారు. అప్పుడే మరెవ్వరూ ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా ఉంటారన్నారు. ఇలాంటి కేసుల్లో విచారణ వేగంగా జరిగి, శిక్ష కూడా త్వరగా పడేందుకు వీలుగా తాము ఒక బిల్లు తీసుకొస్తున్నట్లు ఆయన ట్విట్టర్‌లో తెలిపారు. ఈ కేసుల విషయంలో రాజకీయ చిత్తశుద్ధి, దర్యాప్తు నైపుణ్యం, త్వరగా శిక్షలు పడటం అనేవి చాలా అవసరమని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. 
 
పలు దక్షిణాది సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ప్రముఖ మళయాళ నటి అహహరణ, లైంగిక దాడి కేసులో పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడితో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజా అరెస్టులతో కలిపి మొత్తం తొమ్మిది మందిని పట్టుకున్నట్లయింది.
మరిన్ని వార్తలు