`చెడు అలవాట్లు వదలించుకోండిలా..!

19 May, 2015 14:53 IST|Sakshi
చెడు అలవాట్లు వదలించుకోండిలా..!

లండన్: పొరపాటుగా మీ జీవితంలోకి వచ్చిన చెడు అలవాట్ల నుంచి బయటపడటం మీకు సవాలుగా మారిందా! వాటివల్ల దుష్ప్రవర్తన అలవడిందా.. ఆ ప్రవర్తన నుంచి బయటపడేందుకు ఏమైనా పరిష్కారా మార్గాలుంటే బాగుండు అని అనుకుంటున్నారా.. అయితే లండన్ కు చెందిన హైపోధెరపిస్ట్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ మాస్టర్ ప్రాక్టీసనర్ జాస్మిన్ పిరన్ దురలవాట్లు మానుకునేందుకు కొన్ని చెప్పారు.
అవి
సాధరణంగా ప్రవర్తనను మార్చుకోవాలని చూసుకునే వారు పుట్టిన రోజుకోసమో లేదా సోమవారం నుంచనో, లేక కొత్త సంవత్సరం రోజో అని నిర్ణయించుకుంటారు. ఎప్పుడంటే అప్పుడు మనసులో బలంగా భీష్మించుకొని మననం చేసుకోవాలి.
దురలవాటు అని మనకు మనం గుర్తించినప్పుడు అది పొగతాగడంలాంటిదైనా సరే.. పక్కవారి మాటలు వినకుండా మనకు మనమే ప్రాధాన్యం ఇచ్చుకోవాలి.
మానడానికి కారణమైన పాజిటివ్ ఆలోచనలు జాబితాగా రాసుకోవాలి. వాటిని మననం చేసుకోవాలి
ముందు చాలా ఓపికగా ఉండి.. చిన్న స్థాయి మార్పు నుంచి భారీ స్థాయిలో మార్పు తెచ్చుకోవాలి. ఇందుకోసం రోజు ఆ సమయంలో సాధన చేయాలి
మనసులో పుట్టుకొచ్చే ఆ దురలవాటుకు చెందిన భావోద్వేగాలను ఒకసారి సునిశితంగా పరిశీలించాలి.
ప్రతి రోజూ వస్తున్న మార్పును గమనించాలి.
ఎంతో కొంత మార్పు వస్తుంటే ఎవరిని వారే ప్రోత్సాహించుకుంటూ రివార్డులు ఇచ్చుకోవాలి.

మరిన్ని వార్తలు