రేసిస్ట్‌ పోస్టర్‌పై దుమారం..ఫోటోలు వైరల్‌

15 Apr, 2017 17:01 IST|Sakshi
రేసిస్ట్‌ పోస్టర్‌పై దుమారం..ఫోటోలు వైరల్‌

మెల్‌బోర్న్‌: అమెరికాలో జాత్యంహకారదాడులు కలవర పెడుతోంటే.. తాజాగా ఆస్ట్రేలియాలో జాతి విద్వేష పోస్లర్లు  దిగ్భ్రాంతి రేపాయి.  మెల్‌బోర్న్‌లోని ఓ పాల దుకాణం ముందు ఈ షాకింగ్‌  పోస్టర్లు దర్శనమిచ్చాయి.  ఇది  చూసిన ఓ ట్విట్టర్‌  యూజర్‌ ఈ ఫోటోలను ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశాడు. దీంతో  ఇవి వైరల్‌అయ్యాయి. పోస్లర్లపై  నెటిజన్లు విమర్శలకు  దిగారు.   యజమాని తీరుపై  మండిపడుతున్నారు.

మీడియా నివేదిక ప్రకారం, ఆస్ట్రేలియాలోనిఓ పాల షాప్  ముందు.. 14-18 ఏళ్ల మధ్య నల్లజాతీయులు,  కుక్కలు  షాప్‌లోకి నిషేధం అని పోస్టర్‌ అతికించాడు యజమాని. ఎందుకంటే 14-18ఏళ్ల మధ్య నల్లవారు ఎపుడూ దొంగతనాలకు పాల్పడతారని పేర్కొన్నాడు. అయితే   బ్లాక్‌ టీన్స్‌ దొంగతనాలతో విసిగిపోయాను తాను ఇలా రాసిపెట్టానని సమాధానం చెప్పాడట.

   

మరిన్ని వార్తలు