జైట్లీతో రాజన్ భేటీ

9 Apr, 2015 01:00 IST|Sakshi
జైట్లీతో రాజన్ భేటీ

న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ బుధవారం సమావేశమయ్యారు. దేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై ఈ సందర్భంగా ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జైట్లీతో పాటు ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా,  ఇతర సీనియర్ అధికారులతో రాజన్ సమావేశమయ్యారు.రైతులకు రుణ పునర్‌వ్యవస్థీకరణ:  అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల రుణ పునర్‌వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు తాను సూచించినట్లు రాజన్ చెప్పారు. అంతక్రితం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే విషయాన్ని (రుణ పునర్‌వ్యవస్థీకరణకు బ్యాంకులకు సూచన) వెల్లడించారు.  అకాల వర్షాల వల్ల రబీ సాగు పరిధిలో 17% పంట నష్టం జరిగినట్లు మంగళవారంనాటి ఆర్‌బీఐ విధాన ప్రకటన పేర్కొంది. మరోవంక బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ బుధవారం నోటిఫై చేసింది.   
 

మరిన్ని వార్తలు