ప్రధాని అయ్యేందుకు రాహుల్ అర్హుడు: మన్మోహన్ సింగ్

7 Sep, 2013 20:00 IST|Sakshi
ప్రధాని అయ్యేందుకు రాహుల్ అర్హుడు: మన్మోహన్ సింగ్
2014 ఎన్నికల తర్వాత దేశానికి ప్రధాని అయ్యేందుకు అన్నివిధాలా రాహుల్ గాంధీ అర్హుడని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి సేవలందించడానికి తాను సిద్ధమని ప్రధాని వెల్లడించారు. తన జీవితం తెరిచిన పుస్తకమని మన్మోహన్ తెలిపారు. వ్యక్తిగతంగా, ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలకు తగిన రీతిలో సమాధానం చెప్పలేదంటూ తనపై వచ్చిన విమర్శలను ప్రధాని తప్పుబట్టారు.
 
రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన జి20 సమావేశాల్లో పాల్గొని తిరిగి స్వదేశానికి వస్తూ ప్రత్యేక విమానంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ తో మళ్లీ పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకపోలేవని ఆయన స్పష్టం చేశారు. న్యూయార్క్ లో పాకిస్థాన్ ప్రధానితో జరిగే చర్చల్లో ఉగ్రవాదంపై తుది నిర్ణయానికి వచ్చే ముందు వాస్తవ పరిస్థితులపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాని మన్మోహన్ సింగ్ మరో ప్రశ్నకు జవాబిచ్చారు. 
మరిన్ని వార్తలు