కాసేపట్లో బడ్జెట్ : రైల్వే స్టాక్స్ ఢమాల్

1 Feb, 2017 16:45 IST|Sakshi
కాసేపట్లో బడ్జెట్ : రైల్వే స్టాక్స్ ఢమాల్
మరికొద్ది సేపట్లో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానున్న నేపథ్యంలో రైల్వే స్టాక్స్ పడిపోయాయి. రైల్వేకు సంబంధించిన కంపెనీలన్నీ నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న రైల్వే బడ్జెట్పై ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయి. మొదటిసారి రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లో కలిపి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో టెక్స్మాకో రైల్, కాళిందీ రైల్ నిర్మాణ్, కెర్నెక్స్ మైక్రోసిస్టమ్స్ షేర్లు బుధవారం ఇంట్రాడేలో 3 నుంచి 5 శాతం దిగువకు ట్రేడవుతున్నాయి.
 
రైల్వేస్ భద్రతా ఫండ్పై ఇన్వెస్టర్లు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు విశ్లేషకులు చెప్పారు. ఇటీవల పలుచోట్ల ఘోర రైల్వేప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే. రైల్వే డెవలప్మెంట్ అథారిటీ అండ్ హై స్పీడ్ రైల్వే అథారిటీని కూడా ఈ బడ్జెట్లోనే ఏర్పాటుచేయనున్నారు.  మరోవైపు మార్కెట్లు సైతం ఆందోళనలో లాభనష్టాల ఊగిసలాటలో నడుస్తున్నాయి. 
మరిన్ని వార్తలు