కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు రాజా సస్పెన్షన్

1 Jun, 2014 16:57 IST|Sakshi

గౌహతి:  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సీనియర్ కాంగ్రెస్ నేత అనిల్ రాజాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతకుముందే అతన్ని పార్టీ జనరల్ సెక్రటరీ హోదా నుంచి తొలగించిన అస్సాం పీసీసీ..  తాజాగా పార్టీ నుంచి వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు భవనేశ్వర్ కాలితా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పార్టీ వ్యతిరేక కార్యకలాపాకు పాల్పడుతున్న అతనిని తొలగిస్తున్నట్లు తెలిపారు.

 

కాంగ్రెస్ ఎదుర్కొనే సవాళ్లును పార్టీ నేతలు అంతా కలిసికట్టుగా అధిగమించడానికి యత్నించాలని చెప్పినా రాజా మాత్రం వాటిని అతిక్రమించాడని కాలితా స్పష్టం చేశారు. గత 2009 లోక్ సభకు నోవ్ గాంగ్ నుంచి పోటీచేసిన రాజా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు