ఆశారాం బాపూకు మరోసారి చుక్కెదురు

1 Oct, 2013 15:54 IST|Sakshi
ఆశారాం బాపూకు మరోసారి చుక్కెదురు

జోథ్పూర్: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు కోర్టులో మరోసారి చుక్కెదురయింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించింది. డిఫెన్స్, ప్రాసిక్యూషన్ లాయర్ల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్జిత్ కౌర్.. ఆశారాం బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చారు. ఆశారాం తరపున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వాదనలు వినిపించారు.  

గత నెల 13న ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను జోధ్‌పూర్‌ కోర్టు తోసిపుచ్చింది. 72 ఏళ్ల ఆశారాం బాపూ సెప్టెంబర్ 2 నుంచి జోధ్‌పూర్‌ సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయనకు విధించిన జ్యుడీషియల్ కస్టడీని జోధ్‌పూర్‌ కోర్టు ఈ నెల 11కు వరకు పొడిగించింది. జోధ్‌పూర్‌ సమీపంలోని తన ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆగస్టు 20న ఆశారాం బాపుపై కేసు నమోదయింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఆశ్రమంలో అరెస్ట్ చేసి ఆయనను సెప్టెంబర్ 1న జోథ్పూర్కు తరలించారు.

మరిన్ని వార్తలు