ఇక్కడ అన్న..అక్కడ తమ్ముడు

12 Jan, 2017 20:33 IST|Sakshi
ఇక్కడ అన్న..అక్కడ తమ్ముడు

ముంబై:  టాటా మిస్త్రీ  బోర్డ్ వార్ లో టాటా గ్రూప్ లో  కీలక  నియామకాలు గురువారం చోటు చేసుకున్నాయి.  టాటాసన్స్ కొత్త ఛైర్మన్ గా టీసీఎస్ ఎండీ  ఎన్ చంద్రశేఖరన్ ఎంపికయ్యారు. గురువారం నిర్వహించిన  టాటా సన్స బోర్డ్ సమావేశంలొ ఈ మేరకు నిర్ణయం జరిగింది. దీంతో  ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్  (టీసీఎస్)  సంస్థ సీఈవో గా రాజేష్ గోపీనాథన్  ను  టాటా గ్రూపు నియమించింది. అలాగే ఎన్ జీ సుబ్రమణియం కొత్త సీవోవోగా  ఎంపికయ్యారు. అయితే ఎన్ జీ సుబ్రమణియం చంద్రశేఖరన్ కు సోదరుడు.   
టీసీఎస్ విజన్  రోడ్  మ్యాప్ లో ఎలాంటి మార్పులు  ఉండవని  టీసీఎస్  కొత్త బాస్ గోపీనాథన్ ప్రకటించారు. తన ఎంపికపై సంతోషాన్ని ప్రకటించిన టాటా సన్స్ కొత్త ఛైర్మన్  చంద్రశేఖరన్ టీసీఎస్ కు గోపీనాథన్ ఎంపికపై  హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు మంచి వ్యాపార దక్షత ఉందని కొనియాడారు.  టీసీఎస్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ లో అపారమైన అనుభవం ఉందన్నారు. ఆయన నేతృత్వంలో టీసీఎస్ మరింత  వ్యాపారంలో్ మరింత ఎత్తుకు ఎదగగలదనే విశ్వాసాన్ని వ్యక్తం  చేశారు.
మరోవైపు టాటాసన్స్ కొత్త చైర్మన్ గా చంద్రశేఖరన్ ఎంపిక పై  సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.   ముఖ్యంగా  అతిపెద్ద   ప్రభుత్వ రంగ బ్యాంకు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఛైర్మన్ అరుంధతి భట్టాచార్య, నీతి ఆయోగ్ ఛైర్మన్ అమితాబ్ కాంత్  తదితర ప్రముఖులు  చంద్రశేఖరన్ నియామకాన్ని స్వాగతించారు.

 

మరిన్ని వార్తలు