కబాలి వర్సెస్‌ సుల్తాన్‌.. గెలిచిందెవరు?

1 Aug, 2016 19:50 IST|Sakshi
కబాలి వర్సెస్‌ సుల్తాన్‌.. గెలిచిందెవరు?

ఈ సీజన్‌లో విపరీతంగా క్రేజ్‌ సంపాదించుకున్న సినిమాలు రెండు. అవి సల్మాన్‌ ఖాన్‌ సుల్తాన్‌.. రజనీకాంత్‌ కబాలి. 'కబాలి' విడుదలయ్యే వరకు సుల్తాన్‌ బాక్సాఫీసును దున్నేశాడు. రికార్డు వసూళ్ల ప్రభంజనం సృష్టించాడు. కానీ, కబాలి ఎంట్రీతో సుల్తాన్‌ సైడ్‌ అయ్యాడు. కబాలి తన జోరు ఏంటో చూపాడు. రజనీ మానియాలో దేశం ఊగిపోయింది. బాక్సాఫీసు రికార్డులన్నీ బద్దలయ్యాయి. దీంతో సహజంగానే దేశంలో ఎవరు అతిపెద్ద సూపర్ స్టార్‌ అని చర్చ అభిమానుల్లో మొదలైంది. బాలీవుడ్‌ ఖాన్‌ త్రయం సల్మాన్‌, షారుఖ్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ అందనంత స్థాయిలో రజనీ హల్‌చల్‌ చేశాడు. దేశంలో బిగ్గెస్ట్‌ స్టార్‌ సల్మానా? రజనీకాంతా? అన్న చర్చ అభిమానుల మొదలైంది...
 

  • విడుదలకు ముందే కబాలి సినిమా కనీవినీ ఎరుగని క్రేజ్‌ సంపాదించుకుంది. దేశం మొత్తం రజనీ నామస్మరణలో మునిగిపోయింది. అంచనాలు ఆకాశాన్నంటాయి. దీంతో చెన్నై, బెంగళూరులోని పలు కంపెనీలు విడుదల రోజున సెలవు ప్రకటించాయి. జపాన్‌ అభిమానులు ఏకంగా విమానంలో చెన్నైకి వచ్చి తొలిరోజు సినిమా చూశారు. విడుదల రోజున ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు షోలు హౌస్‌ఫుల్‌ నడిచాయి. అభిమానులైతే 'కబాలి' రిలీజ్‌ నాడు జనజాతర చేశారు. రజనీ కటౌట్లను పాలాభిషేకాలతో ముంచెత్తారు. తొలిరోజు 90శాతం ఆక్యూపెన్సీతో రజనీ తన స్టామినా ఏంటో చూపించాడు. రిలీజ్‌ మానియా విషయంలో సల్మాన్‌ ఖాన్‌ 'సుల్తాన్‌' తేలిపోయింది. రజనీ సినిమాకు వచ్చిన ప్రీ రిలీజ్‌ క్రేజ్‌.. దేశంలో మరే స్టా్‌ర్‌ హీరో సినిమాకూ ఇప్పటివరకు రాలేదు.

     
  • బాక్సాఫీసు వసూళ్ల విషయానికొస్తే కబాలి అన్ని రికార్డులను బద్దలుకొట్టాడు. ఒక్క బాహుబలి సినిమా రికార్డును మాత్రం కబాలి చిత్రం అందుకోలేకపోయింది. తొలిరోజు సుల్తాన్‌ సినిమా రూ. 36.5 కోట్లు వసూలు చేస్తే.. కబాలి ఏకంగా రూ. 48 కోట్లు కొల్లగొట్టింది. చాలా మల్టిప్లెక్స్‌ థియేటర్లలో తొలిరోజు సుల్తాన్‌ సినిమా టికెట్లను రూ. 300-350 వరకు అమ్మారు. అదే కబాలి విషయానికొస్తే మల్టిప్లెక్స్‌ హాల్స్‌లోనూ టికెట్‌ ధర రూ. 120కి మించలేదు. అయినా సుల్తాన్‌ రికార్డును కబాలి దాటాడు.
     
  • ఓవర్సీస్‌ వసూళ్లు: అంతర్జాతీయ కలెక్షన్ల విషయంలోనూ కబాలి విజేతగా నిలిచాడు. అమెరికా బాక్సాఫీసు వద్ద భారతీయ సినిమా రికార్డులన్నింటినీ కబాలి కొల్లగొట్టింది. ఓవర్సీస్‌లోనూ సుల్తాన్‌ రికార్డులను కబాలి అవలీలగా దాటాడు.
     
  • ప్రమోషన్స్‌: 'రేప్‌' వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న సల్మాన్‌ ఖాన్‌ 'సుల్తాన్‌' సినిమా ప్రమోషన్‌లో పెద్దగా పాల్గొనలేదు. ఈ వివాదం వల్ల విలేకరులతోనూ మాట్లాడలేదు. ఇక రజనీకాంత్‌ తన సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్నారు. 'కబాలి' సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో ఆయన మచ్చుకైనా కనిపించలేదు. సినిమా విడుదలకు నెల ముందే అమెరికాకు వెళ్లిపోయారు. విడుదలయ్యాక వచ్చారు. అయినా రజనీ మానియా దేశాన్ని చుట్టుకుంది. విమానాలపై పోస్టర్ల నుంచి కార్లపై ఫొటోలు, కటౌట్‌లు, ఆన్‌లైన్‌ అమ్మకాలు ఇలా సర్వత్రా రజనీ మ్యాజిక్ అంటే ప్రపంచానికి చూపింది. ఇంతకంటే ప్రూఫ్‌ కావాలా రజనీ దేశంలో ఎంతపెద్ద స్టారో చెప్పడానికి అంటున్నారు ఫ్యాన్స్‌..

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు