‘బాహుబలి-2’ మీకు నచ్చలేదా? అయితే..!

2 May, 2017 21:00 IST|Sakshi
‘బాహుబలి-2’ మీకు నచ్చలేదా? అయితే..!

సినీ పండితులు ముందే చెప్పారు. అభిమానులు ఎప్పుడో ఊహించారు. అంతా అనుకున్నట్టుగానే భారీ అంచనాలతో విడుదలైన ‘బాహుబలి-2’  బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తున్నది. ఇప్పటికే రూ. 500 కోట్ల క్లబ్బులో చేరిన ఈ సినిమా భారత సినీ చరిత్రలో వెయ్యికోట్ల క్లబ్బులో చేరిన తొలి సినిమాగా రికార్డు సృష్టించిన ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు సినీ పండితులు.

ఎవరి అంచనాలు ఎలా ఉన్నా కొంతమందికి ‘బాహుబలి-2’ సినిమా నచ్చి ఉండకపోవచ్చు. అలా ఈ సినిమా నచ్చనివారు ఎవరైనా ఉంటే వారికోసం దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తనదైన స్టైల్‌ ముందుకొచ్చారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వర్మ ‘బాహుబలి-2’ సినిమాను మాత్రం ప్రశంసలతో ఆకాశానికెత్తేశారు. ఈ నేపథ్యంలోనే ‘ఎవరికైనా ‘బాహుబలి-2’ సినిమా నచ్చకపోతే వారిని చూసి నేను బాధపడతాను. వారికి మానసిక వైద్యుడి సాయం అవసరముంది. అలాంటి వారి డాక్టర్‌ బిల్లు స్వచ్ఛంద సేవ కింద నిర్మాత శోభూ భరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని వర్మ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా ప్రేక్షకులు ‘బాహుబలి-2’  ఆదరిస్తున్న పరిస్థితిని చూస్తుంటే.. ఈ సినిమా చూడటానికి అరుణగ్రహం నుంచి గ్రహాంతరవాసులు స్పేస్‌షిప్‌లో భూమికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ తనదైన స్టైల్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు