పెద్దనోట్ల రద్దు భారీ కుంభకోణం-రాందేవ్

17 Dec, 2016 16:35 IST|Sakshi
పెద్దనోట్ల రద్దు భారీ కుంభకోణం-రాందేవ్

న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్  డీమానిటేజేషన్ పై  సంచలన వ్యాఖ్యలు చేశారు.  పెద్ద నోట్ల రద్దు తర్వాత  బ్యాంకర్ల అవినీతి లక్షల కోట్ల కుంభకోణానికి దారి తీయనుందని ఘాటుగా విమర్శించారు.  రూ.3-4లక్షల కోట్ల కుంభకోణానికి దారి తీయనుందని  వ్యాఖ్యానించారు.పెద్దనోట్ల రద్దు ప్రక్రియను ఇంకా బాగా అమలు చేసి ఉండాల్సిందని  పేర్కొన్నారు.  ప్రధానమంత్రి ని బ్యాంకర్లు తప్పు దారి పట్టించారన్నారు.  అంతేకాదు బీజేపీతో తన సాన్నిహిత్యం ఇక పాతమాట అని  రాందేవ్ వ్యాఖ్యానించడం విశేషం.
పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధానికి తమ మద్దతును తెలిపిన  రాందేవ్  జైపూర్ లో  ఈ  ఆసక్తికర వ్యాఖ్యలు చేసారని జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది.  మోదీ అవినీతి బ్యాంకర్ల చేతిలో చిక్కారు. నగదు సరఫరా ఒక సమస్య కాదు, కానీ నగదు అవినీతి మార్గం పట్టడమే  సమస్య అని  రాందేవ్ వ్యాఖ్యానించినట్టు నివేదించింది. మరోవైపు  ఇటీవల  ప్రతిపక్ష రాజకీయ నాయకులు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ , జేడీయూ నేత లాలూ ప్రసాద్ తో భేటీ  కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే దీనిపై వ్యాఖ్యానించిడానికి రాం దేవ్ అనుచరులు నిరాకరించారు.  పెద్దనోట్ల  రద్దు తర్వాత పేదల కష్టాలు, వారి అసంతృప్తి,  పెరుగుతున్న అసహనం నేపథ్యంలో ఇలా వ్యాఖ్యానించారన్నారు.

కాగా నాణ్యతలేని ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో  రాందేవ్ బాబా పతంజలి కంపెనీకి కోర్టు రూ.11 లక్షల జరిమానా  విధించింది. 2012లో హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో  నమోదైన  ఈ కేసులో నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదని అప్పుడే నిరూపితమైంది. అయితే గత నాలుగేళ్లుగా నానుతున్న ఈ కేసుపై భారీ జరిమానా విధించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు