రణ్‌బీర్‌తో కలిసి సిగరెట్‌ తాగిన భామ!

22 Sep, 2017 13:30 IST|Sakshi
రణ్‌బీర్‌తో కలిసి సిగరెట్‌ తాగిన భామ!

బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, పాకిస్థాన్‌ హాట్‌భామ మహిరా ఖాన్‌ డేటింగ్‌ చేస్తున్నారనే వదంతులు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. గత మార్చ్‌ నెలలో దుబాయ్‌లో జరిగిన గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ వేడుకలో ఈ ఇద్దరూ కలిసి పాల్గొనడం.. ఆ సమయంలో వేదిక వెనుక ఇద్దరు మాట్లాడుతూ కెమెరా కంటికి చిక్కడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా న్యూయార్క్‌లో విహరిస్తున్న ఈ ఇద్దరి ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఈ ఇద్దరు సిగరెట్‌ తాగుతున్న ఫొటోలు ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో కనిపించడంతో వైరల్‌గా మారిపోయాయి.

మహిరా ఖాన్‌ తాజాగా షారుఖ్‌ ఖాన్‌ సరసన 'రాయిస్‌' సినిమాలో అలరించిన సంగతి తెలిసిందే. బ్యాక్‌లెస్‌ వైట్‌ డ్రైస్‌ ధరించిన మహిరా న్యూయార్క్‌ స్ట్రీట్‌లో రణ్‌బీర్‌తో కలిసి చక్కర్లు కొడుతూ ఫొటోగ్రాఫర్ల కంటపడింది. ఈ ఇద్దరు సిగరెట్‌ దమ్ము లాగిస్తున్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. వీరు డేటింగ్‌ చేస్తున్నారన్న కథనాలను గతంలో మహిరా, రణ్‌బీర్‌ ఖండించారు. తాను ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నట్టు రణ్‌బీర్‌ చెప్తుండగా.. ఈ ఫొటోలకు స్పందనగా.. 'ఫస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ నో.. సెకండాఫ్‌ నో' అంటూ సంక్షిప్త సమాధానాన్ని మహిరా ఖాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని కామెంట్లు వినబడుతున్నాయి.
 

మరిన్ని వార్తలు