హీరో అని తెలియక ఫొటో తీయమన్నారు!

14 Aug, 2016 19:26 IST|Sakshi

స్విట్జర్లాండ్‌.. ఆకాశం నుంచి నేలకు దిగివచ్చిన తెల్లని మేఘాల్లాంటి మంచుకొండలతో ప్రకృతి సౌందర్యంతో అలారాడే పర్యాటకుల స్వర్గధామం. అలాంటి ప్రదేశానికి వెళితే.. ఎవరికైనా ఫొటో దిగాలనిపిస్తుంది. ఆ ప్రకృతి సౌందర్యం చెంత ఫొటో తీసుకోవాలని ఓ కొరియన్‌ జంటకు కూడా అనిపించింది.


అదే సమయంలో అక్కడ తచ్చాడుతున్న ఓ యువకుడిని పిలిచి 'ప్లీజ్‌ సర్. మా ఫొటో తీసిపెట్టండి' అని రిక్వెష్ట్ చేశారు. అతను కూడా ఆనందంగా ఒప్పుకున్నాడు. అందమైన ప్రకృతిముందు ఆనందంగా ఒదిగిపోయిన ఈ జంటను క్లిక్‌మనిపించాడు. కానీ, ఆ ఫొటో వారి జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని మధురానుభూతిని మిగిల్చింది.

ఎందుకంటే ఆ ఫొటో తీసింది బాలీవుడ్‌ 'బాజీరావు' రణ్‌వీర్‌ సింగ్. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో విహరిస్తున్న ఈ యువ హీరో గురించి మనకు తెలుసు కానీ, కొరియన్‌ కపుల్‌కి ఏం తెలుసు? అందుకే ఓ మామూలు పర్యాటకుడు అనుకొని ఫొటో తీయించుకున్నారు. కానీ, తర్వాత తమ ఫొటో తీసింది బాలీవుడ్‌ స్టార్‌ హీరో అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. 'అతను భారత్‌లో పెద్ద హీరో అని తెలియదు. కానీ అడుగగానే ఈ ఫొటో తీసి పెట్టాడు. ఆయన పెద్ద మనస్సుకు కృతజ్ఞతలు. ఆయన పెద్ద సూపర్‌ స్టార్‌ అని తెలిసి ఆశ్చర్యపోయాం' అని కొరియన్‌ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. రణ్‌వీర్‌సింగ్‌ తీసిన ఫొటోను కూడా షేర్‌ చేసింది.
 

>
మరిన్ని వార్తలు