రేపిస్టులను చచ్చేదాకా ఉరి తీయాలి: జయప్రద

4 Dec, 2013 03:17 IST|Sakshi

పణజి: మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారిని చచ్చేదాకా ఉరి తీయాలని ప్రముఖ సినీ నటి, ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ ఎంపీ జయప్రద అన్నారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం గోవా వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ ఉదంతంపై స్పందిస్తూ మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారిని చచ్చే వరకూ ఉరేయాలన్నారు.
 

ఉత్తరప్రదేశ్ సహా ముంబై, ఢిల్లీలోనూ మహిళలకు రక్షణ లేదన్నారు. యూపీలో హింస పెరిగిందని జయప్రద ఆందోళన వ్యక్తం చేశారు. సమాజ్‌వాది పార్టీ పాలన మహిళలు, పిల్లలకే కాదు సామాన్య ప్రజలకు కూడా రక్షణ కరువయిందన్నారు. హింస కంటే అవినీతే నయమని యూపీ ప్రజలు వాపోతున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన ముజాఫర్ నగర్ హింసాత్మక ఘటనలే దీనికి నిదర్శనమని జయప్రద అన్నారు.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా