తిక్కపుడితే.. చదివి కలెక్టర్‌నవుతా..!

27 Sep, 2015 03:45 IST|Sakshi
తిక్కపుడితే.. చదివి కలెక్టర్‌నవుతా..!

 పత్రికలపై ‘రసమయి’ ఆక్రోశం

 తిమ్మాపూర్ : తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ పత్రికలపై ఆక్రోశం వెళ్లగక్కారు.  రైతుల ఆత్మహత్యలపై బాధ్యతగా వ్యవహరించాల్సిన పత్రికలు పతాక శీర్షికల్లో వాటిని రాస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. తప్పుడు రాతలు రాసిన విలేకరిని వేరే దేశంలో ఉరితీశారని చెప్పుకొచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో బీసీ బాలికల గురుకుల పాఠశాల భవనం, కేజీబీవీ భవనాల్ని ప్రారంభించేందుకు మంత్రి జోగు రామన్న, ఎంపీ వినోద్‌కుమార్ రాగా..

సభలో వారి ఎదుటే ఎమ్మెల్యే రసమయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రతినిధి కావడం చాలా కష్టమని, తిక్కపుడితే.. నాలుగు నెలలు ఇంట్లో కూర్చుని చదువుకుంటే.. కరీంనగర్ జిల్లాకు కలెక్టర్‌నవుతానని ఎమ్మెల్యే రసమయి స్పష్టం చేశారు.  పత్రికలు మంచిని రాస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు