ఆర్బీఐ నిర్ణయంతో వాహన, గృహ రుణాలు తగ్గుతాయా?

4 Oct, 2016 16:13 IST|Sakshi
ఆర్బీఐ నిర్ణయంతో వాహన, గృహ రుణాలు తగ్గుతాయా?

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన మానిటరీ పాలసీ రివ్యూ కమిటీ తన తొలి సమీక్షలో  పండుగ కానుక అందించింది.  వడ్డీరోట్ల  కోత ఉండక పోవచ్చని, యథాతథంగా ఉంటుందనే ఎనలిస్టులు విభిన్న అంచనాల మధ్య ఆర్ బీఐ రెపో రేట్లలో కోత పెట్టి అందర్నీ ఆశ్యర్యంలో ముంచెత్తింది.  రెపో రేటులో 0.25 శాతం తగ్గింపు ప్రకటన మంగళవారం  దలాల్ స్ట్రీట్ లో  జోష్ పెంచింది.  తొలిసారి ఏర్పాటైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ)  వడ్డీ రేట్ల తగ్గింపునకే మొగ్గు చూపింది. రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి దిగివచ్చి ఆరేళ్ల కనిష్టానికి చేరింది.  ద్రవ్య నిష్పత్తి (ఎస్ఎల్ఆర్)  4 శాతం గా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)  20,75 శాతం యథాతథంగా ఉంచింది. 2 015 సం.రంనుంచి దాదాపు 175 పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది.  దీంతో వాహన, గృహ రుణాలు తగ్గుముఖం పట్టునున్నాయనే ఆశలుమార్కెట్ వర్గాల్లో చిగురించాయి.
 
ఆర్ బీఐ గవర్నర్ హోదాలో తొలిసారి మీడియాతో మాట్లాడిన ఉర్జిత్ పటేల్ (52)పలు కీలక అంశాలను ప్రస్తావించారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న కస్టమర్లకు లబ్ధిని చేకూర్చడంతో పాటు మరింత తక్కువ రేట్లకు నూతన రుణాల లభ్యతను పెంచే లక్ష్యంతో రెపో రేటును పావు శాతం మేరకు తగ్గించినట్టు చెప్పారు. బ్యాంకులకు గుదిబండగా మారిన బ్యాడ్ లోన్ల అంశంపై దృష్టి పెట్టామన్నారు. ఇది మానిటరీ పాలసీ ఎకగ్రీవ నిర్ణయమని ఉర్జిత్ పటేల్ వెల్లడించారు. ద్రవ్య వైఖరి లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు.   రోడ్డు  రైల్వేలు భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయని,   వ్యాపారంలో సౌలభ్యం, పప్పుల సరఫరాలో వృద్ది, పోటీ ర్యాంకింగ్ లో వృద్ది ఉండనుందని   ఉర్జిత్ పటేల్  చెప్పారు.  అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడుతున్న సంక్షోభ పరిణామాల నుంచి సులువుగా, వేగంగా బయటపడేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. టోకు ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణంతో పాటు సంతృప్తికరంగా ఉన్న రుతుపవనాలు, పంట దిగుబడి పెరగనుందన్న అంచనాలు తమ నిర్ణయానికి కారణమని ఆయన తెలిపారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు వెంటనే రుణ తగ్గింపు చర్యలు చేపట్టి వినియోగదారులకు  మరింత వెసులుబాటు కల్పించాలని ఉర్జిత్ కోరారు. అలాగే వచ్చే ఏడాది అమలులోకి రానున్న జీఎస్టీ (వస్తు సేవల పన్ను) దేశంలో పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచనుందని, మరిన్ని విదేశీ పెట్టుబడులు దేశానికి తరలి రానున్నాయని  పటేల్  పేర్కొన్నారు.

 

>
మరిన్ని వార్తలు