ఆశలు ఆవిరి.. ఎక్కడి రేట్లు అక్కడే

12 Dec, 2016 14:44 IST|Sakshi
ఆశలు ఆవిరి.. ఎక్కడి రేట్లు అక్కడే
మెజారిటీ విశ్లేషకులు, బ్యాంకర్ల అంచనాలు తలకిందులయ్యాయి. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ షాకింగ్ న్యూస్ ప్రకటించారు. కీలక రెపో రేటులో ఎలాంటి కోత లేదని వెల్లడిస్తూ మార్కెట్ వర్గాలకు, విశ్లేషకులకు షాకిచ్చారు. రెండు రోజుల సమీక్ష నేపథ్యంలో నిన్న సమావేశమైన ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. రెపో రేటును ఏ మాత్రం మార్చకుండా ఇంతకుముందున్న 6.25 శాతాన్ని అలాగే ఉంచారు.
 
రెపోతో పాటు రివర్స్ రెపో రేటులోనూ ఎలాంటి మార్పు చేయలేదు. రివర్స్ రెపో రేటునూ 5.75శాతంగానే ఉంచారు. మానిటరీ కమిటీలోని ఆరుగురు సభ్యులు రేట్ల కోతకు మొగ్గుచూపలేదని ఉర్జిత్ పటేల్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల వద్దకు భారీగా చేరిన డిపాజిట్ల నేపథ్యంలో లిక్విడిటీని అదుపులోకి ఉంచడానికి 100 శాతం పెంచిన ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్ను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు.