-

ఐసీజేకి తిరిగి నామినేట్‌ అయిన జస్టిస్‌ భండారీ

21 Jun, 2017 09:27 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) జడ్జి పదవికి భారత్‌ తన అభ్యర్థిగా మరోసారి సీనియర్‌ న్యాయమూర్తి జిస్టిస్‌ దల్వీర్‌ భండారీని నామినేట్‌ చేసింది. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆయన గెలుపొందితే ఈ పదవిలో 9 ఏళ్లు ఉంటారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్‌ వద్ద భారత్‌ నామినేషన్‌ దాఖలు చేసింది. 2012లో ఐరాస అసెంబ్లీ, భద్రతా మండలిలో ఏకకాలంలో జరిగిన ఓటింగ్‌లో 69 ఏళ్ల భండారీ ఈ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. ఐసీజే జడ్జిగా భండారీ పలు కీలక కేసుల్లో తీర్పులిచ్చారు. 

మరిన్ని వార్తలు