సెల్ ఫోన్లు వాడొద్దన్నందుకు ఆత్మహత్య!

13 Sep, 2014 16:26 IST|Sakshi

అగర్తలా: సెల్ ఫోన్లు వాడొద్దన్నందుకు ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. త్రిపుర పట్టణంలోని హాస్టల్లో ఉంటూ 10 వ తరగతి చదువుతున్న ఇద్దరు యువతలు తరచు మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ ఉండటంతో వార్డెన్ వారిని మందలించాడు. హాస్టల్లో మొబైల్ ఫోన్లు వాడకకూడదని వాళ్లకు సూచించాడు.  అయినా వారిద్దరూ ఆ మాటలను పెడచెవిన పెట్టడంతో వార్డెన్ ఆ విషయాన్ని ఆ అమ్మాయిల తల్లిదండ్రులకు తెలిపాడు.

 

ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసిందన్న కారణంతో వారు గురువారం హాస్టల్ నుంచి  పారిపోయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీస్ అధికారి ప్రదీప్ దేయ్ తెలిపారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా